న్యూఢిల్లీ : ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తన వేర్‌హౌస్‌ల్లో రోబో సేవలను ప్రవేశపెట్టనుంది. పోర్టెస్, కార్డినాల్ పేరుతో వ్యవహరించే ఈ రోబోలు ఉద్యోగుల పనిభారాన్ని తగ్గించడంలో సాయపడతాయి. ఉద్యోగుల కదలికలను పసిగడుతూ వేర్‌హౌస్‌ల్లో కలియతిరిగుతూ ఈ రోబోలు పనులను చక్కబెడతాయి. అమెజాన్ అభివృద్ధి చేసిన అడ్వాన్స్డ్ సేఫ్టీ, నేవిగేషన్ టెక్నాలజీ వాడుతూ ఈ రోబోలు పనిచేస్తాయి.
ప్రజల మధ్య నిరంతరం తిరుగుతూ పనిచేసేలా రోబోలను తీర్చిదిద్దారు. కేవలం నియంత్రిత ప్రదేశాల్లోనే ఈ రోబోలను పరిమితం చేయబోమని ఇవి వేర్‌హౌస్‌ల్లో స్వతంత్రంగా తిరుగుతూ ఉద్యోగులకు పనిలో సాయం చేస్తాయని బ్లాగ్‌పోస్ట్‌లో అమెజాన్ పేర్కొంది. అమెజాన్ కార్డినల్ పేరుతో మరో రోబోటిక్ వ్యవస్ధను కూడా ప్రకటించింది. ప్యాకేజ్‌ల తరలింపులో కార్డినల్ రోబో పని చేసేలా డిజైన్ చేశారు. వచ్చే ఏడాది చివరి నాటికి వేర్‌హౌస్‌ల్లో రోబోలను దింపనుంది.
అమెజాన్‌లో షిప్పింగ్ ప్రక్రియ కార్డినల్తో వేగవంతమవుతుందని కంపెనీ తెలిపింది. 50 పౌండ్ల బరువు వరకూ ప్యాకేజ్‌లను హ్యాండిల్ చేసే కార్డినల్ ప్రొటోటైప్‌ను ప్రస్తుతం పరీక్షిస్తున్నామని, వచ్చే ఏడాది ఫుల్ఫిల్మెంట్ సెంటర్లలో ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని అమెజాన్ వెల్లడించింది.