Amazon Layoffs : కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించే క్రమంలో అమెజాన్ ఆడిబుల్ డివిజన్ ఉద్యోగుల సంఖ్యను ఐదు శాతం కుదించాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియలో వంద మంది ఉద్యోగులను తొలగించినట్టు ఆడిబుల్ సీఈవో బాబ్ కరిగన్ ఉద్యోగులకు పంపిన మెమోలో వెల్లడించారు.
అమెజాన్ ఇటీవల ప్రైమ్ వీడియో, ఎంజీఎం స్టూడియోస్, ట్విచ్ లైమ్స్ట్రీమింగ్ వంటి ఇతర విభాగాల్లో లేఆఫ్స్ ప్రకటించని క్రమంలో తాజా లేఆఫ్స్ వెలుగులోకి వచ్చాయి. మారిన వ్యాపార పరిస్ధితుల్లో ఆడిబుల్ సమర్ధవంతమైన సంస్ధగా ఎదిగేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మెమోలో కరిగన్ వివరించారు.
ఇక తొలగించిన ఉద్యోగులకు కంపెనీ మద్దతుగా నిలుస్తుందని, వారికి నూతన అవకాశాలు వచ్చే దిశగా బాసటగా నిలుస్తుందని కరిగన్ పేర్కొన్నారు. అమెజాన్ 2008లో 300 మిలియన్ డాలర్లు వెచ్చించి ఆడిబుల్ను టేకోవర్ చేసింది. ఇక 2022, 2023లో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ ఏకంగా 27,000 మంది ఉద్యోగులను తొలగించి మాస్ లేఆఫ్స్‌కు తెగబడింది.
Read More :