Amazon India | ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా (Amazon India) అధినేత మనీష్ తివారీ (Manish Tiwari) రాజీనామా చేశారని సమాచారం. ఎనిమిదిన్నరేండ్లుగా అమెజాన్‌తో అనుబంధం తెంచుకున్నట్లు కంపెనీ వర్గాల కథనం. మనీష్ తివారీ కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారని తెలుస్తోంది. రిటైలర్ సంస్థ యూనీ లివర్ లో ఏండ్ల తరబడి పని చేసిన అనుభవంతో 2016లో మనీష్ తివారీ అమెజాన్ లో చేరారు. అమెజాన్ ఇండియాలో కన్జూమర్ బిజినెస్’కు మనీశ్ తివారీ సారధ్యం వహించారు. ఆన్లైన్లో క్రయ, విక్రయాలపై ప్రత్యేకించి కేంద్రీకరించారు. అయితే, మనీష్ తివారీ తదుపరి కార్యాచరణ ఏమిటన్నది తెలియదని అమెజాన్ వర్గాలు తెలిపాయి. అధికార మార్పిడి కోసం అక్టోబర్ వరకూ అమెజాన్ లో కొనసాగుతారని సమాచారం.
మనీష్ తివారీ నిష్క్రమణపై అమెజాన్ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ‘అమెజాన్ ఇండియా కంట్రీ మేనేజర్‌గా పని చేస్తున్న మనీష్ తివారీ కంపెనీ బయట అవకాశాల వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆయన నాయకత్వం గత ఎనిమిదేండ్లలో భారతీయ ప్రజలకు ప్రిఫర్డ్ మార్కెట్ ప్లేస్‌గా అమెజాన్.ఇన్ను తీర్చి దిద్దడంలో ఇన్స్ట్రుమెంటల్గా వ్యవహరించారు’ అని తెలిపారు.
iQoo Z9s 5G | బడ్జెట్ ధరకే ఐక్యూ జడ్9ఎస్ సిరీస్ ఫోన్లు.. 21న ఆవిష్కరణ..!
Tata Curvv EV | 7న టాటా కర్వ్.ఈవీతోపాటు చార్జ్ పాయింట్ అగ్రిగేటర్ ఆవిష్కరణ.. ఇవీ డిటైల్స్..!