న్యూఢిల్లీ, జూన్ 25: అమెజాన్ భారత్లో భారీ పెట్టుబడులు పెట్టబోతున్నట్టు ప్రకటించింది. వచ్చే ఐదేండ్లకాలంలో ఏఐ, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేవలను మరింత విస్తరించడానికి 13 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేయబోతున్నట్టు కంపెనీ సీఈవో ఆండీ జెస్సీ తెలిపారు. గురువారం ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
అనంతరం ఈ భారీ పెట్టుబడుల ప్రకటన చేశారు. భారత్లో దీర్ఘకాలికంగా నిబద్ధతకు కట్టుబడివున్నామని, తాజా పెట్టుబడితో మొత్తం పెట్టుబడులు 48 బిలయన్ డాలర్లకు చేరుకున్నాయన్నారు. ఇదే క్రమంలో 2026 నుంచి 2030 మధ్యకాలంలో ఏఐ, క్లౌడ్ సేవలను మరింత విస్తరించడానికి 21 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. ఈ పెట్టుబడులతోనే ముంబై, హైదరాబాద్ డాటా సెంటర్లను మరింత విస్తరించనున్నట్టు తెలిపారు.