బెంగళూరు, ఏప్రిల్ 29: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా మళ్లీ గ్రేట్ సమ్మర్ సేల్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. మే 1న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభంకానున్న సమ్మర్ సేల్లో అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ పరికరాలపై భారీగా డిస్కౌంట్ను కల్పిస్తున్నది. సామ్సంగ్తోపాటు టీసీఎల్, టాటా ఉత్పత్తులపై 50 శాతం వరకు తగ్గింపు ధరతో విక్రయిస్తున్నది.
ఈ సమ్మర్ సేల్లో భాగంగా షాపింగ్, బుకింట్ టికెట్స్, బిల్లుల చెల్లింపులపై రూ.5 వేల వరకు రివార్డును కూడా అందిస్తున్నది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో చెల్లింపులు జరిపిన వారికి 5 శాతం క్యాష్బ్యాక్తోపాటు వెల్కమ్ రివార్డు కింద రూ.2,500 అందిస్తున్నది.