Discounts on Smart Phones | ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్-2023 పేరిట స్మార్ట్ ఫోన్ కొనుగోలు దారులకు బెస్ట్ ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది. ఆపిల్, శాంసంగ్, వన్ ప్లస్, రెడ్ మీ, వివో బ్రాండ్ ఫోన్లపై ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తున్నది. గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆఫర్ల కింద స్మార్ట్ ఫోన్ ప్రియులు తమకు నచ్చిన స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఐసీఐసీఐ, కొటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డు హోల్డర్లు అదనపు డిస్కౌంట్లు పొందొచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్లతోపాటు నో-కాస్ట్ ఈఎంఐ పేమెంట్ ఆప్షన్లు, అమెజాన్ పే బేస్డ్ డిస్కౌంట్లు కూడా పొందొచ్చు. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ కింద ఆయా స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్లపై ఆఫర్లు, డిస్కౌంట్లు ఎలా ఉన్నాయో చూద్దామా.. !
ఆపిల్ ఐఫోన్-14 ఫోన్ గతేడాది సెప్టెంబర్‌లో మార్కెట్లోకి వచ్చింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం దాని ధర రూ.79,900. కానీ బ్యాంక్ ఆఫర్లు, అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ఆఫర్ కింద రూ.66,999లకే సొంతం చేసుకోవచ్చు. అదీ కాకుండా ఎక్స్చేంజ్ డిస్కౌంట్‌తో కలిసి అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్-2023లో రూ.39,293 లకే సొంతం చేసుకోవచ్చు. పాత ఐ-ఫోన్ మార్చుకున్న వారికి స్పెషల్ డిస్కౌంట్ ధరపై కొత్తగా ఐఫోన్-14 అందిస్తున్నది ఆపిల్. ఈ ఫోన్ ఆపిల్ ఏ15 బయోనిక్ ఎస్వోచీ చిప్ సెట్, 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్ డీఆర్ ఓలెడ్ డిస్ ప్లే ఉంటుంది.
దక్షిణ కొరియా గెలాక్సీ ఎం14 5జీ ఫోన్ బేస్ 4జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ ధర రూ.13,490 కాగా, ఇప్పుడు రూ.12,499కే కొనుగోలు చేయొచ్చు. 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, గెలాక్సీ ఎం14 5జీ ఫోన్ 5ఎన్ఎం ఎక్స్ నోస్ 1330 ఎస్వోసీ చిప్ సెట్‌తో వస్తున్నది. బ్యాంక్ ఆఫర్ తోపాటు ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ.13250 వరకు డిస్కౌంట్ అందుకునే వెసులుబాటు ఉంది.
వన్ ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ ఫోన్ అసలు ధర రూ.19,999. బ్యాంకు ఆఫర్లు, డిస్కౌంట్లతో రూ.18,999లకు సొంతం చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.18,750 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. స్నాప్ డ్రాగన్ 695 ఎస్వోసీ చిప్ సెట్, 108-మెగా పిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్ కలిగి ఉంటుంది వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్. 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ ధర రూ.19,999 నుంచి మొదలవుతుంది.
వన్ ప్లస్ 11ఆర్ 5జీ ఫోన్ 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ ధర రూ.39,999. కానీ, బ్యాంక్ ఆఫర్ కింద రూ.38,999లకు కొనుగోలు చేయొచ్చు. పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ కింద రూ.25 వేల వరకు రాయితీ పొందవచ్చు. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ +15జీ ఎస్వోసీ చిప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డిస్ ప్లే 6.74 అంగుళాల ఫుల్ హెచ్డీ + కర్వుడ్ అమోలెడ్ డిస్ ప్లే, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది.
గత నెలలో దేశీయ మార్కెట్లో ఆవిష్కరించిన రియల్ మీ నార్జో ఎన్55 ఫోన్.. ఆపిల్ డైనమిక్ ఐలాండ్ మాదిరిగా మినీ క్యా్ప్సుల్ ఫీచర్ కలిగి ఉంటుంది. దీని అసలు ధర రూ.10,999 కాగా, అమెజాన్ సమ్మర్ సేల్స్ కింద రూ.10,249 ధరకు అందుబాటులో ఉంది. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.10,300 ఇన్ స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. అమెజాన్ పే వాలెట్ ద్వారా చెల్లింపులు జరిపితే మరింత రాయితీ అందుకోవచ్చు. రియల్ మీ నార్జో ఎన్55 ఫోన్ మీడియా టెక్ హెలియో జీ88 ఎస్వోసీ చిప్ సెట్, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 33 వాట్ల సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
షియోమీ సబ్ బ్రాండ్ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ రెడ్ మీ 12 సీ (బ్యాంకు ఆఫర్లతో కలిసి) రూ.8499లకు లభిస్తుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.8400 వరకు రాయితీ పొందొచ్చు. దీని అసలు ధర రూ.13,999.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ‘వివో వై56 5జీ’ గత ఫిబ్రవరిలో మార్కెట్లోకి వచ్చింది. దీని ధర రూ.19,999. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ కింద (బ్యాంకు ఆఫర్లతో కలిసి) రూ.18,999లకు లభిస్తుంది. పాత ఫోన్ ఎక్స్చేంజ్ కింద రూ.18,750 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ నోకియా.. ఎక్స్30 5జీ ఫోన్ అసలు ధర రూ.48,999. స్నాప్ డ్రాగన్ 695 5జీ ఎస్వోసీ చిప్ సెట్ తో వచ్చింది. 8జీబీ రామ్ విత్ 256 ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ తో వస్తున్నది. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ కింద (బ్యాంకు ఆఫర్లతోపాటు) రాయితీపై రూ.35,999లకు సొంతం చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.28 వేలకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు.