బెంగళూరు, జనవరి 14: అమెజాన్ ఇండియా ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026’ ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 16న ప్రారంభంకానున్న ఈ ఆఫర్లు స్మార్ట్ఫోన్లు, గృహోపకరణాలు, ఫ్యాషన్, బ్యూటీ, రోజువారి వస్తువులను తగ్గింపు ధరకు విక్రయిస్తున్నది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు, ఈఎంఐ ద్వారా కొనుగోళ్లపై 10 శాతం ఇన్స్టంట్ రాయితీతోపాటు అదనంగా రూ.10 వేల వరకు బ్యాంకు రాయితీ పొందవచ్చునని తెలిపింది.
అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో 5 శాతం క్యాష్బ్యాక్తోపాటు రూ.2, 500 విలువైన రివార్డులు కూడా లభించనున్నాయి. ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లపై రూ.60 వేల వరకు ఎక్సేంజ్ ఆఫర్ పొందవచ్చును. వీటితోపాటు టాప్ బ్రాండ్లు యాపిల్, సామ్సంగ్, వన్ప్లస్, సోనీ, ఎల్జీ, షియోమీ, టీసీఎల్, హెచ్పీ, బోట్ ఉత్పత్తులను తక్కువ ధరకే అందిస్తున్నది.