Amazon Great Indian Festival Finale Days | ప్రస్తుతం పండుగల సీజన్ నేపథ్యంలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ నిర్వహిస్తున్న ‘అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ డేస్ సేల్స్’ ముగింపు దశకు చేరుతున్నది. దీపావళి పండుగ నేపథ్యంలో ‘అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫైనలే డేస్ సేల్స్’ లో లాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నది. ఆపిల్, హెచ్‌పీ, ఎసెర్ తదితర కంపెనీల లాప్ టాప్‌లు.. వివిధ కంపెనీల స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరకే లభిస్తాయి. వీటికి తోడు సెలెక్టెడ్ బ్యాంక్ కార్డులపై అదనంగా 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. ఈ నెల ఒకటో తేదీన మొదలైన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫైనలే డేస్ సేల్స్ ఈ నెల 10 వరకూ కొనసాగుతాయి.
అందులో భాగంగా 2020లో ఆవిష్కరించిన ఆపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ (ఎం1) పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేశారు. లాంచింగ్ ధర రూ.99,990 కాగా, ఇప్పుడు రూ.69,990లకే లభిస్తుంది. సెలెక్టెడ్ బ్యాంక్ కార్డుపై ధర రూ.62,990కి దిగి వస్తుంది. దీంతోపాటు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ఈఎంఐ ట్రాన్సాక్షన్లతో కొనుగోలు చేస్తే పది శాతం, గరిష్టంగా రూ.3,500 డిస్కౌంట్, పది శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ లేదా రూ.1750 వరకూ రాయితీ పొందొచ్చు. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై అదనంగా మరో ఐదు శాతం క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు.
లాప్ టాప్ పేరు ———- —- ఎంఆర్ పీ —–డిస్కౌంట్ల తర్వాత ధర
ఆపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ ఎం1 — రూ.99,990 — రూ.62,990
ఎసేర్ అస్పైర్5 గేమింగ్ లాప్ టాప్ – రూ.82,999 — రూ.50,490
హెచ్‌పీ పెవిలియన్ ఎక్స్360 —– రూ.62,293 — రూ.55,490
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫైనలే డైస్ సేల్స్‌లో లాప్టాప్లతోపాటు స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరకే లభిస్తాయి. సెలెక్టెడ్ బ్యాంకు డెబిట్ లేదా క్రెడిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ఈఎంఐ ఆప్షన్లపైనా అదనపు డిస్కౌంట్లు అందిస్తున్నది. ఐసీఐసీఐ డెబిట్ / క్రెడిట్ కార్డు / క్రెడిట్ కార్డు ఈఎంఐ ఆప్షనలతో కొనుగోలు చేస్తే 10శాతం గరిష్టంగా రూ.6500 ఇన్ స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో చెల్లిస్తే ఐదు శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్, ఐదు శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై ఇన్ స్టండ్ డిస్కౌంట్ రూపంలో రూ.5,000, రూ.6500 రకు డిస్కౌంట్, వన్ కార్డు పేమెంట్స్ మీద పదిశాతం (గరిష్టంగా రూ.8,250 వరకు) వరకూ రాయితీ పొందొచ్చు.
ఆపిల్ ఐఫోన్ 13 ధర రూ.69,900 కాగా, రూ.55,999లకే లభిస్తుంది.
వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 ఫోన్ రూ. 28,998 కాగా, ఇప్పుడు రూ.24,499లకే సొంతం చేసుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎం 34 ఫోన్ లాంచింగ్ ధర రూ. 24,999 కాగా, ఫెస్టివ్ ఆఫర్లో రూ.14,999 లకే కొనుక్కోవచ్చు.
ఐక్యూ జడ్ 7ఎస్ ఫోన్ ఆవిష్కరణ ధర రూ. 23,999.. ఇప్పుడు ఫెస్టివ్ ఆఫర్ లో రూ.14,999 లకు పొందొచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎం 14 ఆవిష్కరించినప్పుడు రూ.17,990 లకు విక్రయించగా, ఇప్పుడు రూ.10,490లకు లభిస్తుంది.
లావా అగ్ని2 5జీ ఫోన్ లాంచింగ్ ధర రూ.25,999. కాగా, ఇప్పుడు రూ.17,999 లకే కొనుగోలు చేయొచ్చు.
రియల్మీ నార్జో ఐ ప్రైమ్ ఫోన్ ఆవిష్కరణ ధర రూ.9,999 కాగా, ఇప్పుడు రూ.6,569లకే పొందొచ్చు.
రెడ్మీ నోట్ 12 ఫోన్ రూ.18,999లకు ఆవిష్కరించగా, ఇప్పుడు రూ.10,499లకే లభిస్తుంది.
వన్‌ప్లస్ 11 ఆర్ 5జీ ఫోన్ లాంచింగ్ ధర రూ. 39,999 కాగా, ఇప్పుడు రూ. 37,999లకే పొందొచ్చు.
టెక్నో పోవా5ప్రో 5జీ ఫోన్ మార్కెట్లో ఆవిష్కరించినప్పుడు రూ.19,999లకు లభించగా, ఇప్పుడు రూ.12,299 లకు సొంతం చేసుకోవచ్చు.