Amazfit Active smartwatch : భారత్‌లో అత్యాధునిక ఫీచర్లతో అమేజ్‌ఫిట్ యాక్టివ్ స్మార్ట్‌వాచ్ లాంఛ్ అయింది. ఈ స్మార్ట్‌వాచ్ 1.75 ఇంచ్ హెచ్డీ అమోల్డ్ డిస్ప్లే, డజన్ హెల్త్ ఫీచర్లతో కస్టమర్ల ముందుకొచ్చింది. బిల్టిన్ అలెక్సా, నేవిగేషన్‌తో కూడిన ఈ వాచ్ 120 యాక్టివిటీ ట్రాకర్స్‌ను కలిగింది.
ఇక ఈ స్మార్ట్‌వాచ్‌లు కంపెనీ వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఆన్లైన్ రిటైలర్స్ వద్ద రూ. 12,999కి లభిస్తాయి. ఈ స్మార్ట్‌వాచ్ కేవలం 24 గ్రాముల బరువుతో లైట్ వెయిట్ కలిగిఉండటంతో చేతికి హెవీగా అనిపించదు.
అల్యూమినియం అలాయ్, సాఫ్ట్ సిలికాన్ వంటి అత్యున్నత నాణ్యతతో కూడిన మెటీరియల్స్‌తో ఈ హాట్ డివైజ్‌ను డిజైన్ చేయడంతో మన్నికతో పాటు సౌకర్యవంతంగా ఉంటుంది. ఇక హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్, స్ట్రెస్ లెవెల్స్, స్లీప్ ట్రాకింగ్ సహా పలు హెల్త్ ఫీచర్లు ఉన్నాయి.
Read More :