హైదరాబాద్, సెప్టెంబర్ 7: ప్రపంచంలో అతిపెద్ద ప్రీమియం అల్యుమినియం బిల్డింగ్ సిస్టమ్స్ కంపెనీల్లో ఒకటైన అలుక్ ఇండియా..హైదరాబాద్‌లో ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం సంస్థకు బెంగళూరు, గుర్గావ్లో డిజైన్ సెంటర్లు ఉండగా… హైదరాబాద్‌లో నెలకొల్పింది మూడోది కావడం విశేషం.
ఈ సందర్భంగా కంపెనీ ప్రెసిడెంట్ హెలెన్ రౌక్స్ మాట్లాడుతూ..తొమ్మిదేండ్ల క్రితం దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టినట్టు, తొలి దశలో ఉత్తర భారతంపై దృష్టి సారించినట్లు, తర్వాతి క్రమంలో దక్షిణాది మార్కెట్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇక్కడ ఎక్స్పీరియన్స్ సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అల్యుమినియం భవంతులకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను నెలకొల్పినట్టు, దీంట్లో విండోస్, డోర్లు లభించనున్నాయి.