హైదరాబాద్, మే 1 : కో-వర్కింగ్ నిర్వహణ సంస్థ ఆల్ట్.ఎఫ్..హైదరాబాద్‌లో నూతన కార్యాలయాన్ని తెరిచింది. 56 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లో 1,200 మందికి పైగా కూర్చోవడానికి వీలుంటుందని పేర్కొంది. సౌకర్యవంతమైన కార్యాలయాల మార్కెట్ భారీ వృద్ధిని నమోదు చేసుకుంటున్న హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన తొలి సెంటర్ ఇదేనని కంపెనీ కో-ఫౌండర్ యోగేశ్ అరోరా తెలిపారు. ఒక్కో డెస్క్ నెలకు రూ.8 వేల చొప్పున చార్జీ వసూలు చేస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం సంస్థ..ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌లలో కో-వర్కింగ్ కార్యాలయాలను నిర్వహిస్తున్నది.