హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : 25 వసంతాలుగా వినియోగదారులకు నాణ్యమైన సేవలందిస్తూ నిర్మాణ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న హానర్ హోమ్స్… ఇప్పటి వరకు 1976 గృహాలను నిర్మించగా, సకల సదుపాయాలతో నిర్మించిన ఈ గృహాల్లో 7,500 మంది నివసిస్తున్నారు. తాజాగా అధునాతన సదుపాయాలతో నిర్మితమవుతున్న ‘హానర్ అక్వాంటీస్’ వినియోగదారులకు చక్కని అనంధానుభూతిని కలిగిస్తుందన్నారు.
వచ్చే ఏడాది మార్చి నాటికి అందుబాటులోకి రానున్న ఈ ప్రాజెక్టును ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు వారి అభిరుచులకు అనుగుణంగా నిర్మాణాలను చేపడుతున్నామని హానర్ హోమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ వై స్వప్న కుమార్ తెలిపారు. ప్రస్తుతం లగ్జరీ విల్లాకు డిమాండ్ అత్యధికంగా ఉన్నదని, ఈ సరికొత్త ప్రాజెక్టుకు మార్కెట్లో ప్రచారం కల్పించడానికి టాలీవుడ్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ను ప్రచారకర్తగా నియమించుకున్నట్లు తెలిపారు.
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం భారీ వృద్ధిని నమోదు చేసుకుంటున్నదని, ముఖ్యంగా లగ్జరీ విల్లాలకు ఎనలేని డిమాండ్ ఉందన్నారు. అత్యుత్తమ నిర్మాణాలకు గాను హానర్ హోమ్స్‌కు ప్రీమియం మిడ్ సెగ్మెంట్ గృహాలలో ఉత్తమ సౌకర్యాల కల్పనకు, నిర్మాణ దశలో ఉన్న అత్యున్నత స్థాయి ప్రాజెక్టులకు గాను టైమ్స్ బిజినెన్ అవార్డు-2019, 2021 దక్కించుకున్నామన్నారు.