హైదరాబాద్, జూలై 7: జీఎమ్మార్ ఏరో టెక్నిక్.. ఆకాశ ఎయిర్‌లైన్స్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఆకాశ ఎయిర్‌కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ విమాన సర్వీసులను జీఎమ్మార్ ఏరో సెంటర్లో నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా జీఎమ్మార్ టెక్నిక్ ప్రెసిడెంట్ అశోక్ గోపినాథ్ మాట్లాడుతూ.. మూడేండ్లకుగాను బేస్ మెయింటెనెన్స్ అవసరాలకోసం ఆకాశతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు చెప్పారు.