Hexacom | న్యూఢిల్లీ, మార్చి 20: భారతీ ఎయిర్టెల్ అనుబంధ సంస్థయైన భారతీ హెక్సాకామ్ ఐపీవోకి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ అనుమతినిచ్చింది. ఆఫర్ ఫర్ సేల్ రూట్లోనే 10 కోట్ల షేర్లను విక్రయించనుండగా, కొత్తగా షేర్లను జారీ చేయడం లేదు. భారతీ హెక్సాకామ్లో భారతీ ఎయిర్టెల్కు 70 శాతం వాటా ఉన్నది.