Airtel | ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్టెల్ మరోసారి తన ప్రీపెయిడ్ టారిఫ్ ప్లాన్లలో మార్పులు చేసింది. వినియోగదారులను షాక్ ఇస్తూ.. సంస్థ రూ.189 ప్లాన్‌ను పూర్తిగా నిలిపివేసింది. ఈ ప్లాన్ స్థానంలో రూ.199 విలువైన కొత్త ప్లాన్‌ని ఎంట్రీ లెవల్ ఆఫర్‌గా ప్రకటించింది. ఈ తాజా ప్లాన్ ఎయిర్టెల్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు థర్డ్ పార్టీ రీఛార్జ్ యాప్స్‌లో కూడా అందుబాటులో ఉంది. ఇందులో వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యంతో పాటు ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. మునుపటి రూ.189 ప్లాన్ 21 రోజుల వ్యాలిడిటీతో అందించేంది. అందులో వన్ జీబీ మొబైల్ డేటా, 300 ఎస్ఎంఎస్లు, అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ సౌకర్యం ఉండేది. ఇక కొత్త రూ.199 ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
ఈ ప్లాన్ ప్రధానంగా తక్కువగా ఇంటర్నెట్ ఉపయోగించే కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని రూపొందించింది. ఇందులో రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అపరిమిత కాలింగ్ సౌకర్యం, మొత్తం 2 జీబీ మొబైల్ డేటా అందివ్వనున్నది. డేటా లిమిట్ పూర్తయిన తర్వాత ప్రతీ ఎంబీకి రూ.0.5 చొప్పున అదనంగా ఛార్జ్ వర్తిస్తుంది. ఆ తర్వాత అందుబాటులో ఉన్న ప్లాన్ ధర రూ.219. ఇటీవలి కాలంలో టెలికాం రంగంలో ధరల పెరుగుదల నేపథ్యంలో ఎయిర్టెల్ ఈ మార్పులను తీసుకువచ్చింది. కొత్త ధరలు అమల్లోకి రావడంతో వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.