ఎయిర్‌లైన్స్‌కు 17వేల కోట్ల నష్టాలు
దేశీ ఎయిర్‌లైన్స్ పరిశ్రమ ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.15,000-17,000 కోట్ల నష్టాల్ని చవిచూస్తుందని క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు భారీగా పెరగడం, రూపాయి విలువ క్షీణించడం పరిశ్రమ నష్టాలకు కారణమని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం ఎయిర్‌లైన్స్ పరిశ్రమ రూ.23,000 కోట్ల నష్టాల్ని తెచ్చుకుంది
- ఏటీఎఫ్, రూపాయే కారణం: ఇక్రా
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: దేశీ ఎయిర్‌లైన్స్ పరిశ్రమ ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.15,000-17,000 కోట్ల నష్టాల్ని చవిచూస్తుందని క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు భారీగా పెరగడం, రూపాయి విలువ క్షీణించడం పరిశ్రమ నష్టాలకు కారణమని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం ఎయిర్‌లైన్స్ పరిశ్రమ రూ.23,000 కోట్ల నష్టాల్ని తెచ్చుకుంది. ఇంధన ధరల హెచ్చుతగ్గులు, రూపాయి విలువ ఎగుడుదిగుడులు పరిశ్రమ నిర్వహణా వ్యయాల్ని ప్రభావితం చేస్తాయని ఇక్రా వివరించింది.
ఏటీఎఫ్ సగటు ధర కిలోలీటర్‌కు గత ఏడాది రూ.74,171ఉండగా, ప్రస్తుతం రూ.1,24,400కు చేరింది. ఎయిర్‌లైన్ నిర్వహణా వ్యయంలో ఏటీఎఫ్‌దే 45 శాతం ఉంటుందని, అలాగే ఆ కంపెనీల 35-50 నిర్వహణా ఖర్చుల్ని అమెరికా డాలర్ నిర్దేశిస్తుందని తెలిపింది. దేశీ విమాన ప్రయాణీకుల ట్రాఫిక్ 2022 ఆర్థిక సంవత్సరంలో 57.7 శాతం వృద్ధితో 8.42 కోట్లకు పెరిగిందని, ట్రాఫిక్ వృద్ధిచెందుతున్నప్పటికీ 2023 ఆర్థిక సంవత్సరంలోనూ పరిశ్రమకు భారీ నష్టాలు వస్తాయని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ సుప్రియో బెనర్జీ చెప్పారు. పరిశ్రమ నష్టాల్లో ఉన్నా, తీవ్ర పోటీ నెలకొనడంతో పాటు మార్కెట్ వాటాను నిలబెట్టుకునేందుకు కంపెనీలు విమాన ఛార్జీలను భారీగా పెంచలేకపోతున్నాయని ఇక్రా వివరించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

