విమానాల నిర్వహణ కోర్సు
యువ ఇంజినీర్లకు విమానాల నిర్వహణలో మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్..
- జీఎమ్మార్, ఎయిర్‌బస్ ఆధ్వర్యంలో.. ఇంటర్ పూర్తిచేసినవారికి ప్రవేశాలు
హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ/సిటీ బ్యూరో): యువ ఇంజినీర్లకు విమానాల నిర్వహణలో మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్.. జీఎమ్మార్ గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకొన్నది. దీంతో జీఎమ్మార్ సమగ్ర ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్ (ఏఎంఈ) లైసెన్సింగ్ ప్రొగ్రామ్‌ను హైదరాబాద్‌లోని జీఎమ్మార్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్లోనే అందించే అవకాశం ఏర్పడింది. నాలుగేండ్ల ఈ కోర్సులో రెండు సంవత్సరాలు క్లాస్ రూమ్ బోధనతోపాటు నిర్వహణ, మరమ్మతులు, ఒవర్‌హాల్ (ఎంఆర్వో)పై, అనంతరం రెండేండ్లు జీఎమ్మార్ ఏరో టెక్నిక్ వద్ద శిక్షణ, ఎయిర్‌క్రాఫ్ట్ టైప్ ట్రైనింగ్ అందిస్తారు.
ఒప్పందంలో భాగంగా ఎయిర్‌బస్ సాఫ్ట్వేర్, కోర్స్‌వేర్, ట్రైనీ హ్యాండ్‌బుక్స్, ఎగ్జామినేషన్ డాటాబేస్, ఎయిర్‌బస్‌కు అవసరమైన ప్రాథమిక శిక్షణా మాడ్యూల్స్‌ను ఆన్లైన్ ద్వారా సమకూర్చుతుంది. అవసరమైన సాంకేతిక శిక్షణ మెటీరియల్‌ను ఎయిర్‌బస్ కాంపిటెన్స్ ట్రైనింగ్ రూపంలో అందిస్తుంది. జీఎమ్మార్ ఇన్స్ట్రక్టర్లకు శిక్షణ, శిక్షణా కేంద్రం అసెస్మెంట్ను సైతం ఎయిర్‌బస్ చేయనున్నది. భారత్‌లో ఎంఆర్వో సామర్థ్యాలను మరింత విస్తృత పర్చడానికి ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని ఎయిర్‌బస్ ఇండియా దక్షిణాసియా ప్రెసిడెంట్ రెమి మెల్లార్డ్ పేర్కొన్నారు. జీఎమ్మార్ ఏరో టెక్నిక్ సీఈవో అశోక్ గోపీనాథ్ మాట్లాడుతూ.. దేశంలో విమానయాన ఎకో సిస్టం వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, 2030 నాటికి అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్‌గా భారత్ ఎదుగనున్నదని చెప్పారు. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ప్రధాన బోధనాంశాలుగా హయ్యర్ సెకండరీ సర్టిఫికెట్ (క్లాస్-12) పూర్తిచేసినవారికి ఈ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంటుందని తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి : ఎస్పీ రోహిత్ రాజు
Chevella Court | క్రిమినల్ కేసులను చేవెళ్ల కోర్టుకు బదిలీ చేయడం హర్షనీయం
గుర్రంపోడులో రైతులకు హెచ్‌పీఎస్, ఐసీఎంపై శిక్షణ
Rajya Sabha | ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 8 సీట్లు గెలిచిన బీజేపీ.. ఎస్పీకి 2 సీట్లు
MLA Palla Rajeshwar Reddy | మోదీ,అమిత్ షాతో సీఈసీ కుమ్మక్కు : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

