Vistara | న్యూఢిల్లీ, జూలై 30: దేశీయ విమానయాన రంగ సంస్థ విస్తారా.. తమ పర్మనెంట్ గ్రౌండ్ స్టాఫ్కు వాలంటరీ రిటైర్మెంట్ స్కీం (వీఆర్ఎస్), వాలంటరీ సపరేషన్ స్కీం (వీఎస్ఎస్)లను తాజాగా ప్రకటించింది. ఎయి ర్ ఇండియాలో విలీనం కానున్న క్రమంలో ఇదిప్పుడు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది.
ఎయిర్ ఇండియా సైతం ఇప్పటికే తమ నాన్-ఫ్లైయింగ్ పర్మనెంట్ స్టాఫ్కు ఇదే తరహా ప్లాన్లను ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఐదేండ్లుగా సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది వీఆర్ఎస్ను ఎంచుకోవచ్చని విస్తా రా ఈ సందర్భంగా తెలియజేసింది. అలాగే సంస్థలో ఐదేండ్ల కంటే తక్కువ అనుభవం ఉన్నవారు వీఎస్ఎస్ను తీసుకోవచ్చు. వచ్చే ఏడాది మార్చి 31లోగా పదవీ విరమణ పొందే పైలట్లు, క్యాబిన్ సిబ్బంది, ఇతర ఉద్యోగులెవరైనాసరే ఈ పథకాలకు అనర్హులు.