హైదరాబాద్, జనవరి 11: ప్రముఖ ఆసుపత్రుల నిర్వహణ సంస్థ ఏఐజీ హాస్పిటల్స్ భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నది. రూ.800 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్లో ఆంకాలజీ సెంటర్ను నెలకొల్పబోతున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ప్రొటాన్ బీమ్ థెరపీ సిస్టాన్ని కొనుగోలు చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆంకాలజీ సెంటర్లలో ఇది మూడోది కావడం విశేషం. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఇది తొలుతది. క్యాన్సర్ అడ్వాన్స్ థెరపీ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఏఐజీ..ఐబీఏ నుండి అధునాతన ప్రొటాన్ బీమ్ థెరపీలో క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. ఇందుకోసం బెల్జీయం కేంద్రంగా కార్యకలాపాలు అందిస్తున్న ఐబీఏతో జట్టుకట్టింది. ప్రొటాన్ బీమ్ థెరపీ అనేది రేడియోషన్ థెరపీలో అత్యంత ఖచ్చితమైన సమాచారం ఇవ్వనున్నది. ఇది అసాధారణమైన ఖచ్చితత్వంతో కణితులను లక్ష్యంగా చేసుకొని వైద్య సేవలు అందిస్తుంది. అలాగే చుట్టుపక్కలవున్న ఆరోగ్యకరమైన కణజాలాలకు హానిని గణనీయంగా తగ్గించడం ఈ థెరపీ ప్రత్యేకత. హైదరాబాద్లోని గచ్చిబౌలీ కా్ంయపస్లోనే నెలకొల్పుతున్న ఈ సెంటర్ 300 పడకల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఈ ఆంకాలజీ సెంటర్ త్వరలో అందుబాటులోకి రాబోతున్నది.
ఏఐజీ హాస్పిటల్స్లో మేము చేసే ప్రతి పనిలోనూ రోగులను కేంద్ర బిందువుగా ఉంచడమే మా అచంచలమైన నిబద్దతకు నిదర్శణం. ప్రొటాన్ బీమ్ థెరపీ సిస్టమ్, ఐబీఏతో వ్యూహాత్మక భాగస్వామ్యంతో అత్యాధునిక సంరక్షనను అందించే మా లక్ష్యంలో ఒక పరివర్తనాత్మక ముందడుగును సూచిస్తాయి. ఇందుకోసం గచ్చిబౌలీ క్యాంపస్లో క్యాన్సర్ రోగులకోసం ప్రత్యేకంగా 300 పడకలతో ఆంకాలజీ సెంటర్ను నెలకొల్పబోతున్నాం.
– డాక్టర్ డీ నాగేశ్వర్ రెడ్డి, ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్