xన్యూఢిల్లీ, నవంబర్ 14: బ్యాంకింగ్ రంగంలో ఎప్పట్నుంచో వినిపిస్తున్న వారంలో 5 రోజుల పని దినాల డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. అఖిల భారత బ్యాంక్ అధికారుల సమాఖ్య (ఏఐబీవోసీ) గురువారం దీన్ని వినిపించింది.
ఆదివారానికితోడు శనివారం కూడా సెలవు ఇవ్వాలని, భారతీయ బ్యాంకుల సంఘం (ఐబీఏ) ఇప్పటికే దీన్ని ప్రభుత్వానికి సిఫార్సు చేసిందంటూ కేంద్ర ఆర్థిక సేవల శాఖకు రాసిన ఓ లేఖలో ఏఐబీవోసీ గుర్తుచేసింది.
దీంతోపాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీలను భర్తీ చేసి సిబ్బంది కొరతను తీర్చాలని, బ్యాంక్ ఉద్యోగులపై హింసాత్మక దాడులు జరుగుతున్నాయన్నది. రాజకీయ నేపథ్యం ఉన్న కొందరు.. బ్యాంక్ లోపల, వెలుపలా సిబ్బందిపై దాడులకు తెగబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.