హైదరాబాద్, అక్టోబర్ 12: అంతర్జాతీయ ఇంటెంట్-డ్రైవెన్ కస్టమర్ సొల్యూషన్స్, కాంటాక్ట్ సెంటర్ సేవల సంస్థ (24)7.ఏఐ భారీ స్థాయిలో ఉద్యోగుల సంఖ్యను పెంచుకోనున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్‌తోపాటు బెంగళూరుల్లో ఉన్న సెంటర్లలో సిబ్బంది సంఖ్యను 7 వేలకు పెంచుకుంటున్నది. ప్రస్తుతం ఈ రెండు సెంటర్లలో 4 వేల మంది సిబ్బంది విధు లు నిర్వహిస్తున్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాైల్లెన చిత్తూరు, తిరుపతి, వైజాగ విజయవాడ, మైసూరు నగరాల్లో ఉన్న ప్రతిభ కలిగిన సిబ్బందిని రిక్రూట్ చేసుకుంటున్నది మొత్తం నియామకాల్లో 40 శాతం వీరినే రిక్రూట్ చేసుకోనున్న ట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.