హైదరాబాద్, సెప్టెంబర్ 6: అంతర్జాతీయ లైఫ్ సైన్సెస్ కంపెనీలకు డాటా ఇన్నోవేషన్ సేవలు అందిస్తున్న అజిలిసియం..తాజాగా హైదరాబాద్లో కొత్తగా డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసింది. భారత్లో తన ఉనికిని బలోపేతం చేయడానికి ఈ సెంటర్ను నెలకొల్పుతున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో రాజ్ బాబు తెలిపారు.
కొత్తగా ఏర్పాటు చేసిన ఈ సెంటర్ నుంచి అధునాతన డాటా, అనలిటిక్స్ సొల్యుషన్స్ సేవలు అందించడానికి వినియోగించనున్నట్లు చెప్పా రు. ప్రస్తుతం భారత్లో సంస్థకు 700 మంది ఉద్యోగులు ఉండగా, ఈ ఏడాది చివరినాటికి ఈ సంఖ్యను వెయ్యికి పెంచుకోనున్నట్లు ప్రకటించారు.
వ్యూహాత్మక వ్యాపార విస్తరణలో భాగంగా హైదరాబాద్లో జీసీసీ సెంటర్ను నెలకొల్పినట్లు, పెరుగుతున్న ఫార్మాస్యూటికల్స్ క్లయింట్లకు మెరుగైన సేవలు అందించడానికి వీలు పడనున్నదన్నారు.