శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 29 : హైదరాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏరోసిటీ కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎమ్మార్ ఎయిర్పోర్టు ల్యాండ్ డెవలప్మెంట్ సీఈవో అమన్కపూర్ మాట్లాడుతూ.. తయారీ ఎగుమతులను పెంపొందించాలనే ఉద్దేశంతో విమానాశ్రయంలో ఏరోసిటిని ప్రారంభించినట్టు తెలిపారు.
1.2 లక్షల చదరపు అడుగల విస్తీరణంలో 4.11 ఎకరాల మేర విస్తరించి ఉన్న ఈ గ్రేడ్-ఏ స్థాయి తయారీ కేంద్రంతో పరిశోధన అభివృద్ధి, తయారీ అవసరాలను తీర్చేందుకు దోహదపడనున్నట్టు వివరించారు.