హైదరాబాద్, జూలై 5: ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తి రాజు ఆత్మహత్య చేసుకున్నారు. గత ఏడాది తన మిత్రుడి హత్య కేసులో ఈయన అరస్టైన విష యం తెలిసిందే. అయితే ఇటీవలే బెయిల్పై విడుదలైన ఆయన.. ఇప్పుడిలా బలవన్మరణానికి పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. విజయవాడలోని అయోధ్యనగర్లోగల క్షత్రియ భవన్లో శనివారం నరసింహమూర్తిరాజు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. మరోవైపు ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా, ఘటనాస్థలిలో సూసైడ్ నోట్ దొరికినట్టు సమాచారం.