Adani Transmission | దేశంలోనే అతిపెద్ద విద్యుత్ పంపిణీ సంస్థ.. అదానీ ట్రాన్సిమిషన్ మంగళవారం మరో ఘనత నమోదు చేసింది. టాప్-10 స్క్రిప్ట్ల్లో ఎనిమిదో స్థానానికి చేరుకున్నది. అదానీ ట్రాన్సిమిషన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4.4 లక్షల కోట్లకు చేరుకున్నది. ఇక ఇటీవలే స్టాక్మార్కెట్లో లిస్టయిన భారత జాతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ).. టాప్-10 సంస్థల మార్క్ నుంచి బయటకు వచ్చింది. ఎల్ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4.26 లక్షల కోట్లకు చేరుకుంది.
హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4.31 లక్షల కోట్ల కంటే అదానీ ట్రాన్సిమిషన్ ఎం-క్యాప్ ఎక్కువ. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ.. బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేసన్ రూ.4.33 లక్షల కోట్లు, టెలికం సర్వీసెస్ ప్రొవైడర్ భారతీ ఎయిర్టెల్ ఎం-క్యాప్ రూ. 4.12 లక్షల కోట్లుగా నమోదైంది.
ఇదిలా ఉంటే ఎల్ఐసీ షేర్ మంగళవారం 674, వద్ద సాగింది. స్టాక్ మార్కెట్లలో లిస్టయిన తర్వాత ఎల్ఐసీ వాటా 30 శాతం నష్టపోయింది. రూ.949 నుంచి రూ.674లకు పడిపోవడంతో ఎల్ఐసీ మార్కెట్ క్యాపిటలైజేసన్ రూ.1.75 లక్షల కోట్లు నష్టపోయింది.