న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: అదానీ పవర్ ఆర్థిక ఫలితాలకు ఖర్చుల సెగ గట్టిగానే తాకింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.8.77 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.218. 49 కోట్లతో పోలిస్తే 96 శాతం గండిపడింది. నిర్వహణ ఖర్చులు రూ. 5,389. 24 కోట్ల నుంచి రూ.8,078. 31 కోట్లకు పెరగడం వల్లనే లాభాల్లో గండిపడిందని పేర్కొంది. కంపెనీ ఆదాయం రూ.5,593.58 కోట్ల నుంచి రూ.8,290.21 కోట్లకు చేరుకుంది.