Adani-Hindenburg | గౌతం అదానీ- హిండెన్ బర్గ్ వివాదంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. సౌర విద్యుత్ ప్రాజెక్టులకు ఆమోదం పొందేందుకు భారత్ లోని వివిధ రాష్ట్రాల అధికారులకు ముడుపులిచ్చారన్న ఆరోపణలపై అమెరికా కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. అమెరికా కోర్టులో అభియోగాలను గౌతం అదానీ – హిండెన్ బర్గ్ కేసులో రికార్డులుగా పరిగణించాలని పిటిషనర్ కోరారు. అమెరికా కోర్టులో అభియోగాలకు గౌతం అదానీ- హిండెన్ బర్గ్ కేసుకు సారూప్యత ఉందన్నారు. అమెరికా కోర్టులో అభియోగాల నమోదుతో ‘అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడిందని వెల్లడిస్తుంది. ఈ ఆరోపణలు తీవ్రమైనవి. జాతి ప్రయోజనాల రీత్యా భారత దర్యాప్తు సంస్థలు కూడా దర్యాప్తు చేపట్టాలి’ అని పిటిషనర్ అభ్యర్థించారు. ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్న సెబీ కూడా సమగ్ర నివేదిక సమర్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.