Acer Updated Aspire 5 | ప్రముఖ టెక్నాలజీ సంస్థ ‘ఎసేర్’ భారత్ మార్కెట్లో అప్డేటెడ్ ‘ఎసేర్ ఆస్పైర్ 5 (Acer Aspire 5) (2023) లాప్‌టాప్‌ను ఆవిష్కరించింది. ఇంతకుముందు గ్లోబల్ మార్కెట్లో ‘ఎసేర్ స్విఫ్ట్ ఎడ్జ్’, దేశీయంగా ‘ఎసేర్ స్విఫ్ట్ గో (2023)’ను ఆవిష్కరించింది. తాజాగా మార్కెట్లోకి ఆవిష్కరించి ఎసేర్ ఎస్స్పైర్ 5 లాప్టాప్ భారత్‌లో గేమింగ్ ఆస్షన్ కలిగి ఉంటుంది. ఇది అత్యాధునిక 13 జెన్ ఇంటెల్ ప్రాసెసర్‌తో వస్తున్నది. మల్టీ గెచర్ సపోర్టెడ్ టచ్ ప్యాద్ తోపాటు బ్యాక్ లిట్ కీబోర్డు కలిగి ఉంటుంది. 14- అంగుళాల ఫుల్ హెచ్డీ (1900×1200 పిక్సెల్స్) డబ్ల్యూయూఎక్స్‌జీఏ డిస్ ప్లేతో వస్తున్నది. ప్రీ-ఇన్స్టాల్డ్ విండో 11 ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది.
13త్ జన్ ఇంటెల్ కోర్ ఐ5 133 యూ ప్రాసెసర్‌తో వస్తున్న అప్డేటెడ్ ఎసేర్ ఎస్పైర్ 5 (2023) లాప్ టాప్ భారత్ మార్కెట్లో రూ.70,990 పలుకుతుంది. 13త్ జన్ ఇంటెల్ కోర్ ఐ7 1335 యూ ప్రాసెసర్ గల లాప్ టాప్ ధర రూ.94,999లకు లభిస్తుంది. రెండు వేరియంట్లు గ్రే కలర్డ్ లైట్ వెయిట్ మెటల్ బాడీ కలిగి ఉంటాయి. ఎసేర్ ఈ-స్టోర్, క్రోమా, విజయా సేల్స్, అమెజాన్ వెబ్ సైట్లలో కొనుగోలు చేయొచ్చు.
ఈ-కామర్స్ జెయిట్ అమెజాన్ ద్వారా కొనుగోలు చేస్తే ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్ గల లాప్ టాప్ రూ.78,788, ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్ గల లాప్ టాప్ రూ.89,885లకు అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్లో కొనుగోలు చేసే వారికి రూ.3746, రూ.4296తో ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి.
ఎసేర్ ఎస్పైర్ 5 (2023) లాప్ టాప్ 14-అంగుళాల ఫుల్ హెచ్డ్ (1900 x1200 పిక్సెల్స్) డబ్ల్యూయూఎక్స్‌జీఏ డిస్ ప్లే విత్ రీఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్ అండ్ యాస్పెక్ట్ రేషియో 16:10, 170 డిగస్రీస్ వ్యూయింగ్ యాంగిల్ కలిగి ఉంటుంది. కంపెనీ కాంఫీ వ్యూ ఎల్ఈడీ-బ్యాక్ లిట్ టీఎఫ్టీ ఎల్సీడీ కీ బోర్డు ఉంటాయి.
13త్ జెన్ ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్ విత్ నివిదియా జీఫోర్స్ ఆర్టీఎక్స్ 2050 జీపీయూ కలిగి ఉంటుంది. 8జీబీ డ్యుయల్ చానెల్ ఎల్పీడీడీఆర్4 ఎస్డీరామ్ 32 జీబీ వరకు పొడిగించుకవచ్చు. ఇది వై-ఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2, ఎంయూ-మిమో టెక్నాలజీ, గిగాబైట్ ఈదర్ నెట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. 50 వాట్ల బ్యాటరీ విత్ 65 వాట్ల చార్జింగ్ సపోర్ట్, స్టీరియో స్పీకర్లు కలిగి ఉంటుంది.