న్యూఢిల్లీ : భారత్‌లో ప్రముఖ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ టెకీలకు చేదు కబురు చేరవేసింది. భారత్, శ్రీలంకలో తమ ఉద్యోగులకు ఈ ఏడాది వేతన పెంపుతో పాటు అధిక బోనస్ చెల్లింపులు ఉండవని స్పష్టం చేసింది. కీలక నైపుణ్యాలతో కూడిన విభాగాలకు ఇది వర్తించదని పేర్కొంది. యాక్సెంచర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ విజ్ ఈ మేరకు ఉద్యోగులకు సమాచారం అందించారు.
ఐటీ రంగం పలు సవాళ్లు ఎదుర్కొంటున్న నేపధ్యంలో యాక్సెంచర్ నిర్ణయం వెలువడింది. యాక్సెంచర్ వృద్ధి కూడా అంచనాలకు అనుణంగా లేకపోవడం నిరాశకు గురిచేసింది. 2023 మార్చిలో ఏకంగా 19,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. నైపుణ్యాలు, పని ప్రదేశం ఆధారంగా దీటైన వేతనం అందించేలా యాక్సెంచర్ వేతన చెల్లింపులు ఉంటాయని, ఈ ఏడాది ఉద్యోగులకు వేతన పెంపును కంపెనీ చేపట్టడం లేదని ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్లో కంపెనీ ఎండీ అజయ్ విజ్ పేర్కొన్నారు.
పదోన్నతులను కూడా కంపెనీ కుదిస్తోందని చెప్పారు. ఒకటి నుంచి నాలుగు లెవెల్స్ వరకూ పదోన్నతులను 2024 జూన్ వరకూ వాయిదా వేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఇక భారత్‌లో 3,00,000 మందికిపైగా ప్రొఫెషనల్స్ యాక్సెంచర్‌లో పనిచేస్తున్నారు.
Read More :
Watch: పెట్రోల్ బంక్ సిబ్బందిని గన్‌తో బెదిరించి దోచుకున్న దుండగులు