న్యూఢిల్లీ, మే 3: ఎండల తీవ్రత నేపథ్యంలో గత నెల ఏసీల అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా మునుపెన్నడూలేనివిధంగా 17.5 లక్షల యూనిట్ల విక్రయాలు జరిగాయని మంగళవారం కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లియెన్సెస్ మాన్యుఫ్యాక్చర్స్ అసోసియేషన్ తెలియజేసింది.
దీంతో ఈ ఏడాది 90 లక్షల రెసిడెన్షియల్ ఎయిర్ కండీషనర్ల అమ్మకాలు నమోదు కావచ్చని అంచనా వేసింది. ఏసీల విక్రయాలు 2019 ఏప్రిల్‌తో పోల్చితే 30-35 శాతం, 2021 ఏప్రిల్‌తో చూస్తే రెండింతలైనట్టు పేర్కొన్నది.