న్యూఢిల్లీ, మార్చి 30: ప్రముఖ టెక్నాలజీ సేవల సంస్థ ఏబీబీ..బెంగళూరులో ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించింది. పరిశోధన విభాగంలో టెక్నాలజీ రంగాన్ని మరింత ఆధునీకరించాలనే ఉద్దేశంతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ సెంటర్ కోసం 2,500 మంది టెక్నాలజీస్ట్లు, ఇంజినీర్లు, ప్రిన్సిపల్, డాటా సైంటిస్ట్‌లు, ఆర్కిటెక్ట్‌లు, డొమైన్, ప్రొగ్రాం డెవలపర్లను నియమించుకోనున్నది.