న్యూఢిల్లీ, జూన్ 18: భారత్-బ్రిటన్ల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీని అమల్లో భాగంగా మొదటి 15 ఏండ్లలో రాయితీ సుంకాలపై బ్రిటన్ నుంచి 3.78 లక్షల కార్లు భారత్లోకి దిగుమతి కానున్నాయి. ఈ ఒప్పందం కింద ఆటోమోటివ్ దిగుమతులపై టారిఫ్లు దాదాపు 110 శాతం నుంచి 10 శాతానికి పడిపోనున్నాయని తాజాగా విడుదలైన ఇండియా-యూకే సీఈటీఏ డాక్యుమెంట్ ద్వారా తెలియవస్తున్నది.
అలాగే ఆరో ఏడాది నుంచి బ్రిటన్ ఎలక్ట్రిక్, హైబ్రిడ్/హైడ్రోజన్ ప్యాసింజర్ కార్ల విభాగంలో సుంకాల్లేని ఎగుమతులకు భారత్కు అవకాశం వస్తుందని చెప్తున్నారు. అయితే 20,000-80,000 బ్రిటన్ పౌండ్ ధరల శ్రేణిలోని కార్లకే ఈ ఆఫర్ ఉంటుంది.