హైదరాబాద్ సిటీబ్యూరో, మే 20(నమస్తే తెలంగాణ): సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్(సీడీఎఫ్‌డీ) అధ్యయన సంస్థలో మంగళవారం అంత్రప్రెన్యూర్ టాక్స్ పేరిట ప్రత్యేక సదస్సును నిర్వహించనున్నారు.
లైఫ్ సైన్స్‌లో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే లక్ష్యంగా జరుగుతున్న ఈ సదస్సుకు బయోలాజిక్స్ కంపెనీ సీఈవో గోపాల్‌కృష్ణన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. సీడీఎఫ్‌డీలో వరుసగా అంత్రప్రెన్యూర్‌షిప్ నిర్వహించడంతో నిపుణులతో సమావేశాలు నిర్వహిస్తున్నది.