న్యూయార్క్, జూలై 22 : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలను అధిగమించేందుకు అక్కడి కంపెనీలు తెలివిగా వ్యవహరిస్తున్నాయి. అగ్రరాజ్య విమానయాన సంస్థ డెల్టా ఎయిర్‌లైన్స్.. ఫ్రాన్స్‌లో తయారైన తమ ఎయిర్‌బస్ విమానాల నుంచి ఇంజిన్లను విడదీసి స్వదేశానికి తెచ్చుకుంటున్నది.
అలా మిగతా విడిభాగాలనూ దిగుమతి చేసుకుంటున్నది. దీంతో 10 శాతం సుంకాలు తగ్గుతున్నాయి. దీన్నే టారిఫ్ ఇంజినీరింగ్ అంటారు. ఇది లీగల్. నిబంధనలకు లోబడే ఈ ప్రక్రియ సాగుతుండటంతో సుంకాల నుంచి ఉపశమనం లభిస్తున్నది. నిజానికి ఇది ఇప్పటిది కాదు. 1881లోనే దీన్ని ప్రయోగించి కార్పొరేట్లు లబ్ధి పొందారు.