Market Capitalisation | దేశీయ స్టాక్ మార్కెట్లలో గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో తొమ్మిది సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.97,463.46 కోట్లు పెరిగింది. వాటిల్లో ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా లబ్ధి పొందింది. బజాజ్ ఫైనాన్స్ మాత్రమే రూ.5,210.91 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ నష్టపోయింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ 580.98 (0.91శాతం) లాభంతో ముగిసింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.36,399.36 కోట్లు పుంజుకుని రూ.15,68,995.24 కోట్లకు పెరిగింది. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఎం-క్యాప్ రూ.15,305.71 కోట్ల లబ్ధితో రూ.5,15,976.44 కోట్ల వద్ద ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.14,749.52 కోట్లు పెరిగి రూ.6,54,042.46 కోట్ల వద్ద స్థిర పడింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.11,657.11 కోట్ల లాభంతో రూ.11,25,842.89 కోట్ల వద్ద నిలిచింది.
భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9,352.15 కోట్లు పెరిగి రూ.5,23,087.22 కోట్ల వద్ద స్థిర పడింది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) ఎం-క్యాప్ రూ.6,320.4 కోట్లు పుంజుకుని రూ.5,89,418.46 కోట్ల వద్ద ముగిసింది. ఇన్పోసిస్ ఎం-క్యాప్ రూ.3,507.08 కోట్లు పెరిగి రూ.5,76,529.86 కోట్లకు చేరుకున్నది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఎం-క్యాప్ రూ. 109.77 కోట్ల లాభంతో రూ.12,26,093.23 కోట్ల వద్ద స్థిర పడింది. ఐటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 62.36 కోట్లు పెరిగి రూ. 5,40,699.70 కోట్ల వద్ద స్థిర పడింది.
బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,210.91 నష్టపోయి రూ.4,49,604.04 కోట్లతో సరిపెట్టుకున్నది. గతవారం మార్కెట్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనసాగుతున్నది. తర్వాత స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), ఇన్పోసిస్, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), బజాజ్ ఫైనాన్స్ నిలిచాయి.