హైదరాబాద్, జూన్ 4: 7సీస్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ తమ ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్ (www. onlinerealgames. com)ను పునరుద్ధరించింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ దృష్ట్యా ఓ మూడు కొత్త గేమ్‌లనూ పరిచయం చేసింది. వరల్డ్ క్రికెట్ చాంపియన్స్ లీగ్, హార్స్ వరల్డ్ రైడ్, కేక్ మ్యాచ్:పజిల్ సోర్ట్ గేమ్ పేరిట ఈ నూతన ఆటలను తీసుకొచ్చింది.
ఈ మేరకు బుధవారం సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, కొత్త గేమ్‌లను స్వదేశీ పరిజ్ఞానంతోనే రూపొందించామని, ఇవన్నీ కూడా ఫ్రీ-టు-ప్లే గేమ్స్ అని 7సీస్ ఎంటర్టైన్మెంట్ ఎండీ ఎల్ఎం శంకర్ తెలిపారు. ప్లే స్టోర్, యాప్ స్టోర్, ఇండస్ యాప్‌స్టోర్ తదితర ప్రధాన మొబైల్ ప్లాట్‌ఫామ్స్‌ల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు.