హైదరాబాద్, జూలై 25: టెక్నాలజీ సంస్థ డీబీఎస్ టెక్..హైదరాబాద్‌లో తన వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరించింది. ఇందుకోసం ఈ నెలలోనే ఏకంగా 600 మంది ఫ్రెషర్లను నియమించుకున్నది. దేశవ్యాప్తంగా వ్యాపార విస్తరణకు శ్రీకారం చుట్టిన సంస్థ అందుకు తగ్గట్టుగా ప్రతిభ కలిగిన సిబ్బందికోసం అహర్నిశలు కృషి చేస్తున్నది.
దీంట్లోభాగంగా ఈ నెలలోనే పలు యూనివర్సిటీలు, కాలేజీ క్యాంపస్‌ల ద్వారా 600 మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రపంచస్థాయి ఇంజినీరింగ్ టీమ్స్‌ను, టెక్నాలజీని తయారు చేసేదానిపై సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది.