న్యూఢిల్లీ, ఆగస్టు 23: ఆదిత్యా బిర్లా గ్రూపునకు చెందిన హిందాల్కో ఇండస్ట్రీస్ భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నది. వచ్చే ఐదేండ్లకాలంలో 8 బిలియన్ డాలర్ల(రూ.60 వేల కోట్లకు పైమాటే) పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు హిందాల్కో చైర్మన్ కుమార మంగళం బిర్లా తెలిపారు.
ఈ పెట్టుబడులను నోవెల్లిస్, భారత్లో ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. హిందాల్కో వాటాదారుల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ పెట్టుబడి ప్రతిపాదనల్లో 70 శాతం ఈవీ, మొబిలిటీ, బ్యాటరీలు, కన్జ్యూమర్ డ్యూరబుల్ రంగంలో ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. 2024-25 ఆర్థిక సంవత్సరం చివరినాటికి 300 మెగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నది. వీటిలో 100 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలనుకుంటున్నది.