Gold Loans | ప్రతి భారతీయుడి ఇంట్లో కొద్దోగొప్పో బంగారం ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ అవసరాలు, ఖర్చులను.. అత్యవసర పరిస్థితులను, అనూహ్య పరిణామాలను బట్టి డబ్బు అవసరం కావచ్చు. అటువంటప్పుడు బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకోవాల్సి రావచ్చు. దేశమంతా బ్యాంకుల వారీగా.. మీరు తాకట్టు పెట్టే బంగారాన్ని బట్టి బ్యాంకులు తామిచ్చే రుణాలపై వడ్డీరేట్లు విధిస్తాయి. దేశంలోని టాప్ ఐదు బ్యాంకులు బంగారంపై తక్కువ వడ్డీరేట్లు ఆఫర్ చేస్తున్నాయి. ఆయా ఆఫర్లపై మీరూ ఓ లుక్కేయండి.. !
బ్యాంకు /ఎన్బీఎఫ్సీ —————— బంగారంపై వడ్డీ —————- ప్రాసెసింగ్ ఫీజు
ఇండియన్ బ్యాంక్ ——————- 7.00% ఫ్లోటింగ్ —————— 0.56%
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా —- 7.10% నుంచి 7.20% ———– 0.75%
యూనియన్ బ్యాంక్ —————— 7.25% నుంచి 7.50% వరకు ———
యూకో బ్యాంక్ ————– 7.40% – 7.90% వరకు — రూ.250 – రూ.5000 గరిష్టం
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ——————- 7.60% నుంచి 16.81% వరకు —— ఒకశాతం
కస్టమర్లు కొనుగోలు చేసే బంగారాన్ని బట్టి బ్యాంకులు గరిష్టంగా రుణ పరపతి కల్పిస్తాయి. ఉదాహరణకు అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. గరిష్టంగా ప్రస్తుతం మార్కెట్లో ధరపై 75 శాతం రుణం ఆఫర్ చేస్తున్నది. రూ.లక్ష వరకు మీకు డబ్బు అవసరం కావచ్చు. అంత విలువ గల బంగారంపై రూ.75 వేల వరకు మీకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రుణం అందిస్తుంది.
బంగారం ఆభరణాలను తాకట్టు పెట్టుకుని బ్యాంకులు రుణాలిస్తాయి. రుణ గ్రహీతలు కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి బంగారం ధరలో 80 శాతం వరకు రుణం తీసుకోవచ్చు. సదరు బంగారం ప్యూరిటీని బట్టి లోన్ మంజూరు చేస్తాయి బ్యాంకులు. వివాహం, పిల్లల విద్యాభ్యాసం, కంపెనీ విస్తరణ తదితర దీర్ఘకాలిక అవసరాలకోసం బంగారంపై బ్యాంకులు రుణాలిస్తాయి.
బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవాలనుకునేవారు విశ్వసనీయమైన బ్యాంకర్‌ను ఎంచుకోవాలి. ప్రతి వ్యక్తి ముందు రెండు ఆప్షన్లు ఉంటాయి. బ్యాంకు నుంచైనా.. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) నుంచైనా రుణం పొందొచ్చు. బంగారం విలువ మదింపు చేయడంలో బ్యాంకుల కంటే ఎన్బీఎఫ్సీలు ఉదారంగా వ్యవహరిస్తాయి. బ్యాంకుల కంటే ఎన్బీఎఫ్సీలు బంగారంపై రుణాలకు అధిక వడ్డీ వసూలు చేస్తాయి. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఇచ్చే రుణ ప్రక్రియ సింపుల్‌గా ఉంటుంది. అయితే, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సరైన డాక్యుమెంటేషన్ ప్రాసెస్‌కు అనుగుణగా, పారదర్శక చార్జీలు వసూలు చేస్తుంది.