హైదరాబాద్, సెప్టెంబర్ 9: భారతీయ ప్రీమియర్ డిజిటల్ ఫెస్టివల్ డ్రీమ్‌హాక్ కొత్త ఎడిషన్ హైదరాబాద్‌లో జరుగనున్నది. ఈ ఏడాది నవంబర్ 3 నుంచి 5 వరకు మూడు రోజులపాటు నిర్వహించనున్నారు. ప్రముఖ గేమింగ్, ఈస్పోర్ట్స్ మీడియా కంపెనీ నోడ్విన్ గేమింగ్.. గ్లోబల్ ఈస్పోర్ట్స్ దిగ్గజం ఈఎస్ఎల్ ఫేసిట్ గ్రూప్‌తో కలిసి నాల్గవ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. పేటీఎం ఇన్సైడర్, మేరాఈవెంట్స్ ద్వారా టిక్కెట్లను పొందవచ్చని నోడ్విన్ గేమింగ్ తెలిపింది. అక్టోబర్ 3 నుంచి డే పాస్‌లను అమ్మనున్నారు. మూడో సీజన్‌కు హాజరైనవారికి.. నాల్గో సీజన్ టిక్కెట్ కొనుగోళ్లలో రాయి తీ, తగ్గింపు ప్రయోజనాలు లభించనున్నాయి. కాగా, టెక్నాలజీ నిపుణులు తమ సొంత సిస్టమ్‌లను ఈ ఫెస్టివల్లో ప్రదర్శించవచ్చని ఈ సందర్భంగా నోడ్విన్ గేమింగ్ సహవ్యవస్థాపకుడు, ఎండీ అక్షత్ రాఠీ తెలిపారు.