3d wallpapers | ఒకప్పుడు గోడలకు పెద్దల ఫొటోలు, దేవుడి పటాలు పెట్టుకునేవాళ్లు. క్రమంగా దేవుళ్లు పూజగదికే పరిమితం అయ్యారు. ప్రకృతి దృశ్యాల త్రీడీ వాల్‌పేపర్స్, ఫ్రేమ్స్ పడకగదిని, హాలును ఆక్రమించాయి. తాజాగా వాల్ స్టిక్కర్స్ మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. అలా అని, ఇవి మామూలు వాల్‌పేపర్స్ లాంటివి కాదు. ఎవరో చేయి తిరిగిన చిత్రకారుడు శ్రద్ధగా గోడలపై గీసినట్టే ఉంటాయి. ఏ వయసువారికి తగిన స్టిక్కర్లు ఆ వయసువారిని ఊరిస్తాయి. పిల్లల రూముల్లో కార్టూన్ వాల్స్టిక్కర్స్ ఉంటే.. ఆ సందడే వేరు! ఉత్సాహంగా హోమ్‌వర్క్ చేసుకుంటారు. స్నేహితులకూ గర్వంగా చెప్పుకొంటారు. హాలు విషయానికొస్తే.. అతిథులకు ప్రతి బొమ్మా మ్యూజియం పీస్‌లా కనిపిస్తుంది. దేవుళ్ల చిత్రాలు కూడా స్టిక్కర్ల రూపంలో దొరుకుతున్నాయి. ఆలూమగల అనుబంధానికి చిరునామా అయిన.. బెడ్రూమ్స్ కోసం లవ్ థీమ్ స్టిక్కర్స్ ఉండనే ఉన్నాయి. ప్రకృతి అందాలు, కళాకృతుల రూపాలు గోడలపై ఉంటే ఇంట్లోనూ పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. ఒకసారి అతికిస్తే.. స్టిక్కర్స్ అంత సులువుగా ఊడవు కూడా. వీటివల్ల గోడల రంగు ఏమాత్రం పాడుకాదు. పెయింట్ తయారీ సంస్థలు కూడా వీటిని విక్రయిస్తున్నాయి. డిజైన్, సైజును బట్టి స్టిక్కర్ల ధరలు రూ.50 నుంచి రూ.500 వరకు ఉంటాయి. ఆన్‌లైన్‌లోనూ షాపింగ్ చేసుకోవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
OTT | 2008లోనే భారత్‌లో ఓటీటీ వచ్చిందా? డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌తో లాభమా? నష్టమా?
mini bengal | తెలంగాణలో మినీ బెంగాల్.. కట్టుబొట్టూ అంతా ఉత్తరాది స్టైలే !!
తొలి అనుభవం చాలా ప్రత్యేకం : రాజ్ తరుణ్ హీరోయిన్