తొలి అనుభవం చాలా ప్రత్యేకం : రాజ్ తరుణ్ హీరోయిన్
kashish khan | రింగుల జుట్టు, చెదరని నవ్వు.. కండ్లతోనే కనికట్టు చేస్తుంది కశిష్ ఖాన్. మోడలింగ్‌లో ఓ వెలుగు వెలుగుతున్న ఈ భామ ‘అనుభవించు రాజా’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ‘హీరోయిన్ కావడం చిన్నప్పటి కల’ అంటూ కశిష్ పంచుకుంటున్న కబుర్లు ..

డాక్టర్, లాయర్, టీచర్.. అందరిదీ సమాజంలో ఒక్కో పాత్ర. కానీ నటులు మాత్రమే ఆ పాత్రలన్నీ పోషించగలరు. నటి కావాలనేది నా చిన్నప్పటి కల. తెలుగు సినిమాతో ఆ స్వప్నం నెరవేరినందుకు సంతోషంగా ఉంది. ఏ తొలి అనుభవమైనా జీవితకాలం గుర్తుండిపోతుంది.
తొలి సినిమా అనుభవమూ నాకు ప్రత్యేకమే.
విషాద సన్నివేశాల్లో గ్లిజరిన్ వాడటం నాకు ఇష్టం ఉండదు. సందర్భాన్ని మనసులో
నింపుకొని నటించే ప్రయత్నం చేస్తా. వెనువెంటనే ఎమోషన్స్ మార్చడం అంత సులభం కాకపోయినా.. ఇష్టంగా కష్టపడతాను. మొదటి అవకాశమే అన్నపూర్ణ బ్యానర్లో రావడం అదృష్టం.
హిందీలో డబ్ అయిన తెలుగు సినిమాలు చాలానే చూశాను. నాకు హీరో రవితేజ గారంటే చాలా ఇష్టం. మంచి నటిగా పేరు తెచ్చుకుని బాలీవుడ్‌లోనూ నటించాలని ఉంది. తెలుగులో మరో
సినిమా కూడా విడుదలకు సిద్ధం అవుతున్నది. అన్ని రకాల పాత్రలూ పోషించాలనేది నా ఆశయం.

మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో పుట్టినా, నా చదువంతా ఢిల్లీలోనే సాగింది. కాలేజీ రోజుల్లో మోడలింగ్‌పై మక్కువ పెరిగింది. సినిమాల్లో నటించాలంటే మనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలి. వెండితెర అవకాశాలకు మోడలింగ్ రాచమార్గంలా తోచింది. అందుకే నేను మోడలింగ్ చేస్తూ సినిమాల కోసం ప్రయత్నిస్తున్నా.
నా వ్యక్తిత్వానికి చాలా దగ్గరగా ఉండే పాత్ర కావడం వల్ల కావచ్చు, మొదటిసారే అయినా పెద్దగా కష్ట
పడాల్సిన అవసరం రాలేదు. కానీ మొదటి సినిమా, అందులోనూ బొత్తిగా తెలియని భాష అని మాత్రం భయపడ్డాను. సినిమా బృందం ప్రతి విషయాన్నీ నాకు అర్థమయ్యేలా చెప్పి ప్రోత్సహించడం వల్లే విజయవంతంగా షూటింగ్ పూర్తిచేశాను.
చిత్రీకరణకు రెండు వారాల ముందే డైలాగ్స్ ప్రాక్టీస్ చేసేదాన్ని. అర్థం తెలుసుకుని, తెలుగులో ఎలా పలకాలో నేర్చుకుని.. ప్రామ్టింగ్ లేకుండా సినిమా పూర్తిచేశాను. లైట్స్, కెమెరా, యాక్షన్ అంటే ఏమిటో కూడా తెలియని నేను ఏకంగా హీరోయిన్ అనిపించుకోవడం విచిత్రమే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
kashish khan | కథ వినగానే రాజ్‌తరుణ్ గుర్తుకొచ్చాడు!
Samantha special song | సమంత ఇకపై వరుసగా ఐటం సాంగ్స్ చేయబోతుందా..?
Samantha item song | టాప్ ఫామ్‌లో ఉన్నపుడే ఐటమ్ సాంగ్స్ చేసిన హీరోయిన్లు వీళ్లే.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stepson Kills Stepmother | సవతి తల్లిపై డీజిల్ పోసి.. నిప్పంటించిన సవతి కుమారుడు
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి
Raihan Vadra: ఎగ్జిబిషన్ నుంచి ప్రియాంకా గాంధీ కుమారుడి 75 ఫోటోలు తొలగింపు
Farmers | జనరేటర్‌కు ఒక్క రోజుకే రూ.7 వేలు ఖర్చు పెట్టినం.. హరీశ్ రావుతో రైతు ఆవేదన
Sanju Samson: సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

