కథ వినగానే రాజ్‌తరుణ్ గుర్తుకొచ్చాడు!

“అనుభవించు రాజా’ చిత్రంలోని ఎమోషన్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. రెండు భిన్న కోణాల్లో సాగే నా పాత్ర ఆసక్తినిరేకెత్తిస్తుంది’ అన్నారు రాజ్‌తరుణ్. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ సినిమా నేడు విడుదలవుతున్నది. శ్రీను గవిరెడ్డి దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ పతాకాలపై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. గురువారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రాజ్‌తరుణ్ మాట్లాడుతూ ‘సినిమా ఆసాంతం వినోదభరితంగా సాగుతూనే అంతర్లీనంగా చక్కటి సందేశాన్నిస్తుంది. ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభిస్తున్నది’ అన్నారు. ‘ఈ కథ వినగానే రాజ్‌తరుణ్ గుర్తుకొచ్చాడు. అంతలా తన పాత్రలో ఒదిగిపోయాడు. చిన్న సినిమాకు అన్నపూర్ణ సంస్థ అండగా ఉంటే ఎలాంటి ఫలితాల్ని సాధించవచ్చో ఈ సినిమా బృందం నిరూపించింది’ అని సుప్రియ తెలిపింది. ఈ సినిమా చేయడం ద్వారా జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాల్ని నేర్చుకున్నానని దర్శకుడు శ్రీను గవిరెడ్డి చెప్పారు. షూటింగ్ సమయంలోనే సినిమా విజయంపై నమ్మకం ఏర్పడిందని కథానాయిక కశిష్‌ఖాన్ తెలిపింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాలిన మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లతో ఆందోళన
రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం.. కాంగ్రెస్ వచ్చింది ఉయ్యాలో.. కరెంటు పోయింది ఉయ్యాలో..
తెల్లారేలోగా ఊరంతా నేలమట్టం.. అర్ధరాత్రి వేళ.. పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు
కరెంట్ కోసం ఎదురుచూపులే.. కోతలు, లోవోల్టేజీ సమస్యలపై రైతుల ఆందోళనలు.. పలుచోట్ల ధర్నాలు, సబ్స్టేషన్ల ముట్టడి
కమ్యూనిటీల్లో నీటి కటకట
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

