PayTM | ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం ఐపీవోతో 350 మంది ఆ సంస్థ ప్రస్తుత, మాజీ ఉద్యోగులు మిలియనీర్లుగా అవతరించనున్నారు. వారి ఆస్తి కనీసం రూ.కోటి కానున్నదని తెలుస్తున్నది. ఇక పేటీఎం ఐపీవోకు భారీ స్పందన లభించింది. ప్రతిపాదిత బిడ్లకు 1.89 రెట్లు సబ్స్క్రైబర్లు బిడ్లు దాఖలు చేశారు. దీంతో పేటీఎం షేర్‌ను రూ.2,150లకు కేటాయించనున్నది. ఈ మేరకు పేటీఎం శుక్రవారం రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు ఈ వివరాలు అందజేసింది. ఈ నెల 18న స్టాక్ మార్కెట్లో పేటీఎం లిస్టింగ్ కానున్నదని తెలుస్తోంది.
ఐపీవో బిడ్డింగ్ టైంలో పేటీఎం షేర్ ప్రైస్ బాండ్ రూ. 2,080-రూ.2.150గా నిర్ణయించింది. షేర్ అత్యధిక ధరను పరిగణనలోకి తీసుకుని పేటీఎం విలువ రూ.1.39 లక్షల కోట్లుగా నిర్ణయించింది. ఈ ఐపీవో ద్వారా పేటీఎం రూ.18,300 కోట్ల నిధులు సేకరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచంలోనే ఐపీవోకు వచ్చిన నాలుగో అతిపెద్ద కంపెనీగా పేటీఎం రికార్డు సాధించింది. ఈ ఏడాదిలో రెండో అతిపెద్ద ఐపీవో కానున్నది. ప్రపంచవ్యాప్తంగా కీర్తి స్పెయిన్.. అల్ఫండ్స్కు అతిపెద్ద ఐపీవోగా పేరు వచ్చింది.