Home Loan | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): ద్రవ్యోల్బణం కట్టడి సాకుతో కేంద్రంలోని బీజేపీ సర్కారు చేపడుతున్న వడ్డీరేట్ల పెంపు మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను కల్లగా మారుస్తున్నది. బ్యాంకుల్లో అప్పు చేసి సొంతింటి కలను నిజం చేసుకొన్న సామాన్యులపై ఈఎంఐల రూపంలో కేంద్రసర్కారు పెను భారం మోపుతున్నది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపోరేటు పెంపుతో గృహ రుణ వాయిదాల మొత్తం అమాంతం పెరిగిపోతున్నది. ఆర్బీఐ వడ్డీరేట్ల పెంపుతో గడిచిన రెండేండ్లలో ఈఎంఐలు 20% మేర పెరిగినట్టు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ‘అనరాక్ రీసెర్చ్’ తాజా నివేదికలో వెల్లడించింది. ఆర్బీఐ నిర్ణయంతో మొత్తం గృహరుణంలో అసలు కంటే వడ్డీనే ఎక్కువ కట్టే దుస్థితి దాపురించినట్టు వెల్లడించింది.
నెలకు 4,500 అదనపు ఖర్చు
ఆర్బీఐ రెపోరేటును ఎంత పెంచితే వాణిజ్య బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను అంతశాతం పెంచేస్తాయి. దీంతో వ్యక్తిగత, ఆటోమొబైల్, విద్య, కార్పొరేట్‌తో పాటు గృహరుణాలపై కూడా వడ్డీరేట్లు కూడా పెరుగుతాయి. గడిచిన రెండేండ్లలో ఆర్బీఐ రెపోరేటును 2 శాతానికి పైగా పెంచింది. దీనికి అనుగుణంగా బ్యాంకులు కూడా వడ్డీరేట్లను ఆమేరకు పెంచాయి. ఫలితంగా ఇప్పటికే గృహరుణాలు తీసుకొన్నవారు, కొత్తగా రుణాలు తీసుకొంటున్నవారు అధిక వడ్డీని చెల్లించాల్సివస్తున్నది. 2021 జూలైలో బ్యాంకుల్లో గృహరుణంపై సగటున 6.7% వడ్డీని వసూలు చేసేవారు. దీంతో 20 ఏండ్ల కాలపరిమితికి రూ. 30 లక్షల రుణం తీసుకొన్న గ్రహీత నెలకు రూ. 22,772ను ఈఎంఐగా చెల్లించేవాడు. అయితే, ప్రస్తుతం వడ్డీరేటు 9.15 శాతానికి పెరుగడంతో నెలవారీ ఈఎంఐ రూ. 27,282గా మారింది. అంటే రెండేండ్లలో నెలవారీ ఈఎంఐ చెల్లింపు రూ.4,560 (దాదాపు 20%) పెరిగిందని అనరాక్ రీసెర్చ్ వెల్లడించింది. రెండేండ్ల కిందట 30 లక్షల రుణంలో చెల్లించాల్సిన వడ్డీ రూ. 24,53,239గా ఉంటే అది ప్రస్తుతం రూ. 35,47,648కు చేరింది. అంటే రెండేండ్లలో రూ. 11 లక్షల మేర వడ్డీ అదనంగా పెరిగిందన్నమాట.
మరో రూ. 33.5 లక్షల భారం
సాధారణంగా గృహ రుణాల వడ్డీ రేట్లు పెరిగినప్పుడు ఈఎంఐ మొత్తాన్ని పెంచేబదులు కొన్ని బ్యాంకులు రుణ కాలపరిమితిని పెంచుతూ ఉంటాయి. అయితే, గృహరుణ కాలపరిమితి గరిష్ఠంగా 30 ఏండ్లుగా నిర్ణయిస్తున్నారు. ఈ లెక్కన.. రూ. 30 లక్షల రుణం తీసుకొన్న గ్రహీత 20 ఏండ్ల కాలపరిమితిని 30 ఏండ్లకు మార్చినప్పటికీ.. గ్రహీత ప్రస్తుతం నెలకు రూ. 24,463ను ఈఎంఐగా చెల్లించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో వడ్డీ భారం రూ. 58,06,740కు పెరుగుతుంది. అంటే 2021నాటి గృహరుణంలోని వడ్డీతో పోలిస్తే, అదనంగా మరో రూ. 33.5 లక్షలను వడ్డీగా చెల్లించాలన్నమాట.
Emi
ఈఎంఐ మార్చుకోకుండా కాలపరిమితిని 30 ఏండ్లకు పెంచుకొంటే..
రుణ మొత్తం – రూ.50 లక్షలు
చెల్లించాల్సిన వడ్డీ (9.15% వడ్డీకి) రూ. 96,77,901 (65.9%)
13