హైదరాబాద్, మే 27: ప్రముఖ రియల్టీ సంస్థ అపర్ణ కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్..తాజాగా రిటైల్-కమర్షియల్, ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇందుకోసం రూ.284 కోట్లతో హైదరాబాద్‌లో అపర్ణ నియో షాపింగ్ మాల్, అపర్ణ సినిమాస్ పేర్లతో ప్రత్యేక వ్యాపారాన్ని ఆరంభించింది. నల్లగండ్ల వద్ద 3.67 ఎకరాల స్థలంలో 3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో షాపింగ్ మాల్‌ను నెలకొల్పింది. వీటిలో రూ.252 కోట్లను అపర్ణ నియో షాపింగ్ మాల్ కోసం ఖర్చు చేసిన సంస్థ..మరో రూ.32 కోట్లతో అపర్ణ సినిమాస్‌ను తీర్చిదిద్దింది. అలాగే వ్యాపార విస్తరణలో భాగంగా 2027 నాటికి తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లలో నాలుగు మాల్స్‌ను నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం సంస్థ తెలంగాణతోపాటు ఏపీ, కర్ణాటకల్లో 77 ప్రాజెక్టులను నిర్మించింది. వీటిలో 66 రెసిడెన్షియల్ ప్రాపర్టీలు కాగా, మరో 11 కమర్షియల్ అండ్ రిటైల్ రంగానికి చెందినవి.