ఆన్లైన్ గేమింగ్‌పై 28% జీఎస్టీ!
- క్యాసినోలు, రేసులపై కూడా
- రాబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం
న్యూఢిల్లీ, మే 18: క్యాసినోలు, రేస్ కోర్సులు, ఆన్లైన్ గేమింగ్‌పై జీఎస్టీ మోత మోగనున్నది. వీటిపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను 28 శాతానికి పెంచాలని మంత్రుల బృందం నిర్ణయించింది. ఈ మేరకు తమ తుది నివేదికను కూడా సిద్ధం చేసింది. రాబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ నివేదికను పరిశీలించి అధికారికంగా ధ్రువీకరించే వీలున్నది.
క్యాసినోలు, గుర్రపు పందేలు, ఆన్లైన్ గేమింగ్‌పై ప్రస్తుతం 18 శాతం జీఎస్టీ అమలవుతున్నది. దీనిపై సమీక్షించేందుకు గత ఏడాది మే నెలలో మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాద్ సంగ్మా నేతృత్వంలో మంత్రుల బృందం ఏర్పాటైంది. బృందంలో తెలంగాణ ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావుసహా గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రులు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, గోవా పంచాయతీరాజ్ శాఖ మంత్రి తదితరులున్నారు.
ఈ క్రమంలోనే ఈ నెలారంభంలో జీఎస్టీని 28 శాతానికి పెంచాలని ఈ బృందం ఏకగ్రీవంగా నిర్ణయించింది. బుధవారం మరోసారి సమావేశమై ఖరారు చేసింది. ‘క్యాసినోలు, రేస్ కోర్సులు, ఆన్లైన్ గేమింగ్‌పై పన్ను విషయంలో మంత్రుల బృందం ఏకాభిప్రాయానికి వచ్చింది. నివేదికను ఒకటి, రెండు రోజుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అందజేస్తాం. రాబోయే సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం’ అని సంగ్మా ట్వీట్ చేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

