Startups | నిధుల సమీకరణలో దూసుకుపోతున్న స్టార్టప్‌లు
దేశీయ స్టార్టప్‌లు నిధుల సమీకరణలో దూసుకుపోతున్నాయి. ఈ వారంలో ఏకంగా 27 ఇండియన్ స్టార్టప్‌లో 308 మిలియన్ డాలర్లు లేదా రూ.2,480 కోట్ల నిధులను సమీకరించాయి.
Startups | నూఢిల్లీ, మార్చి 9: దేశీయ స్టార్టప్‌లు నిధుల సమీకరణలో దూసుకుపోతున్నాయి. ఈ వారంలో ఏకంగా 27 ఇండియన్ స్టార్టప్‌లో 308 మిలియన్ డాలర్లు లేదా రూ.2,480 కోట్ల నిధులను సమీకరించాయి. వీటిలో 17 స్టార్టప్‌లో ఇంకా ప్రారంభ దశలో ఉన్నాయి. గతవారంలోనూ 32 స్టార్టప్‌లు 384 మిలియన్ డాలర్ల నిధులను సేకరించాయని స్టార్టప్ న్యూస్ పోర్టల్ ఎంట్రాక్రా శనివారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
వీటిలో ప్రారంభ దశలో ఉన్న 17 స్టార్టప్‌లు 166.8 మిలియన్ డాలర్ల నిధులను సేకరించాయి. ఇలాంటి స్టార్టప్‌లలో ఎంపాకెట్, ఎమా, హంచ్, రోజానాలు ఉన్నాయి. నగరాలవారీగా ఒప్పందాలు ఢిల్లీ-ఎన్సీఆర్లో 10 డీల్స్ జరగగా..బెంగళూరులో 9 జరిగాయి. నిధులు సేకరించిన వాటిలో డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫాం సేవల సంస్థ ఎంపాకెట్ రూ.500 కోట్లు లేదా 60 మిలియన్ డాలర్ల నిధులను బీపీఈఏ క్రెడిట్స్ ప్రైవేట్ క్రెడిట్ ప్లాట్‌ఫాం సేవల సంస్థ నుంచి సేకరించింది.
ఇలా సేకరించిన నిధులను 2.4 కోట్ల మంది రిజిస్టర్డ్ కస్టమర్లకు రుణాలు అందించడానికి వినియోగించనున్నట్లు, అలాగే ప్రొడక్ట్ డెవలప్మెంట్, బీమా వర్టికల్స్ పరిధిని మరింత విస్తరించడానికి వినియోగించనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. అలాగే గ్రామీణ ఈ-కామర్స్ సేవల సంస్థ రోజానా 22.5 మిలియన్ డాలర్ల నిధులను బర్ట్లెస్మాన్ ఇండియా ఇన్వెస్ట్మెంట్స్(బీఐఐ) నుంచి సమీకరించింది.
లాజిస్టిక్-సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఈ నిధులను వినియోగించనున్నట్లు, ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చించనున్నట్లు రోజానా సీఈవో, కో-ఫౌండర్ అంకుర్ దాహియా తెలిపారు. జనరేటివ్ ఏఐ సొల్యున్స్ సేవల సంస్థ ఏమా 25 మిలియన్ డాలర్ల నిధులను ఆకట్టుకున్నది. ఇప్పటి వరకు 1.14 లక్షల స్టార్టప్‌లో 12 లక్షల ఉద్యోగాలను సృష్టించాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

