PhonePe | న్యూఢిల్లీ, అక్టోబర్ 14: దీపావళి సందర్భంగా ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫోన్‌పే ఓ సరికొత్త ప్రమాద బీమాను పరిచయం చేసింది. బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్‌తో కలిసి కేవలం 9 రూపాయలకే రూ.25వేల వరకు ఇన్సూరెన్స్ సదుపాయాన్ని ప్రకటించింది. పటాకులు కాల్చేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే ఈ కవరేజీ లభిస్తుంది. అయితే ఈ బీమా సౌకర్యం 10 రోజులు మాత్రమే ఉంటుంది. అది ఈ నెల 25 నుంచి మొదలవుతుంది. ఒకవేళ 25 తర్వాత పాలసీని తీసుకున్నైట్టెతే ఆ తేదీ నుంచే మిగతా రోజులకు వర్తిస్తుంది. గాయాలపాలైతే దవాఖాన ఖర్చులు వస్తాయి. దురదృష్టవశాత్తు చనిపోయినా బీమా సొమ్మును క్లెయిం చేసుకోవచ్చు. కుటుంబంలో నలుగురికి ఈ పాలసీ కవరేజీ ఉంటుంది. పాలసీదారుడు, వారి భాగస్వామి, ఇద్దరు సంతానానికి బీమా భద్రత ఉంటుంది. ఫోన్‌పే యాప్ ద్వారా ఈ బీమా పాలసీని తీసుకోవచ్చు.