న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: సరికొత్త సెల్టోస్ను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది కియా ఇండియా. పాతదాంతో పోలిస్తే ఈ నయా వెర్షన్ను భారీ మార్పులు చేసినట్లు, ముఖ్యంగా టెక్నాలజీ పరంగా యువతను ఆకట్టుకునే విధంగా డిజైన్ చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ కారు రూ.11.13 లక్షల నుంచి రూ.20.5 లక్షల లోపు ధరల శ్రేణిలో లభించనున్నది. ఎనిమిది అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, ఎల్ఈడీ హెడ్లైట్స్, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్, గ్లాస్ బ్లాక్ ఎక్స్టీరియర్, ఆరు స్పీకర్ ఆడియో సిస్టమ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, టైప్-సీ చార్జింగ్ పోర్ట్, రియర్ ఏసీ వెంట్స్, 1.5 లీటర్ల పెట్రోల్, టర్బో పెట్రోల్, టర్బో డీజిల్ ఇంజిన్తో తయారు చేసింది.